Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య
నవతెలంగాణ-ములుగు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య ఆదేశించారు. మండల ప్రజా పరిషత్ ములుగు సమావేశ మందిరంలో రాయిని గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య సిబ్బందికి డాక్టర్ రవీందర్ అధ్యక్షతన అవగాహన సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాతా శిశు సంరక్షణ సేవలపై సమీక్ష నిర్వహిం చారు. డాక్టర్ అల్లెం అప్పయ్య మాట్లా డు తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాను సారం సాధారణ ప్రసవాలు చేయాలని, సి సెక్షన్ ప్రసవా లను తగ్గించాలని తెలిపారు. ప్రతి గర్భిణీ త్వరిత గతిన 12 వారాల లోపు మొదటి రిజిస్ట్రేషన్ తప్పని సరిగా ఆశలు చేయాలని తెలిపారు. లేనిచో ఆశలు పొందే నెలవారి పారితోషికంలో కోత విధించాల్సి వస్తోందని ఆశలను హెచ్చరించారు. సాధారణ ప్రస వం కోసం గర్భిణీ పాటించవలసిన వ్యాయా మం గురించి తెలి పారు. అనంతరం జాతీయ క్షయ వ్యాధి నియంత్రణ కార్యక్ర మంలో భాగంగా ప్రతి యొక్క ఆశ క్షేత్రస్థాయిలో క్షయవ్యాధి అనుమానితులను గుర్తించి వారి యొక్క శాంపిల్ ను ములుగు లో ఉన్న వ్యాధి నిర్ధారణ కేంద్రం టీ హబ్ పంపించాలని ఆదే శిం చారు. అనంతరం అసంక్రమిత వ్యాధులు సంబంధించి స్క్రీనింగ్ నూటికి నూరు శాతం పూర్తిచేయాలని, డిఎంహెచ్ఓ ఆదేశించారు. సమా వేశంలో టిబి జిల్లా ప్రోగ్రామ్ వైద్యాధికారి డాక్టర్ రవీందర్, వైద్యాధికారి డాక్టర్ జోష్నా దేవి, సాధారణ కాన్పు వ్యాయామ శిక్షకురాలు శోభ, హెల్త్ ఎడ్యుకేటర్ భాస్కర్, సూపర్ వైజర్ సిబ్బంది ఉష, కృష్ణవేణి , లక్ష్మి, ఏఎన్ఎంలు, ఆశలు సిబ్బంది పాల్గొన్నారు.