Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ శశాంక
నవతెలంగాణ-మహబూబాబాద్
మన ఊరు-మన బడిలో పనులు నాణ్యతగా చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి మన ఊరు మన బడి కార్యక్రమం పై సంబంధిత అధికారులతో సమీక్షిం చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మన ఊరు మన బడిలో చేపట్టిన మోడల్ స్కూల్స్, ఇతర ఎంపిక చేసిన పాఠశాలల పనులను సమీక్షిస్తూ మాట్లా డుతూ పనులు నాణ్యతగా చేపట్టాలని, ఫినిషింగ్ మంచిగా ఉండాలని, ఆవరణలో అవసరం మేరకు గ్రావెల్‌తో నింపి నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రావెల్ పనులకు సంబంధించి మేజర్, మైనర్ రిపేర్ పనులలో ఎస్టిమేట్ రూపొం దించాలన్నారు. కలెక్టరేట్ మండలాల వారీగా పనుల ఎస్టిమేట్, శిథిలావస్థలో ఉన్న గదుల తొలగించిన వాటి వివరాలు, అదనపు గదుల నిర్మాణ పనుల ప్రగతిపై సమీక్షించారు. కార్యక్రమంలో డీఈవో ఎండి. అబ్దుల్ హై, డీఈలు, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, డీఆర్డీవో సన్యాసయ్య, ఆర్అండ్ బి ఈఈ. తానేశ్వర్, పిఆర్ ఈ.ఈ. సురేష్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ. హేమలత, ఏ. ఈ. అడిషనల్ డి.ఆర్. డి. ఓ, ఈ.డి.ఎం. ప్రశాంత్, టి.సి.ఎస్. కో ఆర్డి నేటర్, డిఈఓ. కోఆర్డినేటర్, డి.ఈ. ఓ. కంప్యూటర్ ఆపరేటర్, తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కోసమే పట్టణ ప్రగతి
వరంగల్ : స్థానిక సమస్యల పరిష్కారం కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నగర మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. పట్ట ణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బల్ది యా పరిధి 15,16 డివిజన్లలో కమిషనర్ ప్రావీణ్య, డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక ప్రజల నుండి పలు సమస్యలపై వినతులు స్వీకరించి పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 16 వ డివిజన్లో కార్పొరేటర్‌తో కలిసి కీర్తి నగర్ కాలనీ, బొడ్రాయి ప్రాంతాల్లో కలియ తిరుగుతూ స్థానికులు మిషన్ భగీరథ లీకేజీ లు అరికట్టాలని, తాగునీటి సమస్య, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని మేయర్, కమిషనర్ దష్టికి తీసుకురాగా వెంటనే చర్యలు చేపట్టాలని వారు అధికారులను ఆదేశించారు. పార్కును పరిశీలించి తెలంగాణకు క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలన్నారు. కట్టమల్లన్న చెరువును మేయర్, కమిషనర్ లు పరిశీలించి బండ్ సుందరీ కరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అనంతరం 15వ డివిజన్ గొర్రెకుంట లోని హరి హర ఎస్టేట్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణా క్రీడా ప్రాంగణాన్ని వారు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుంకరి మనీషా-శివకుమార్, ఆకుల మనోహర్, గద్దె బాబు, బల్దియా ఈ ఈ శ్రీనివాస్ రావు,డిఎఫ్ ఓ కిషోర్, గోపాల్ రావు, వార్డు అధికారులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ ఒక్కరూ పోటీ పడి మొక్కలు పెంచాలి
వెంకటాపూర్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పోటీ పడి మొక్కలను పెంచితేనే పర్యావరణతో పల్లెలు పచ్చగా ఉంటాయని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా మండల కేంద్రంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొ న్నారు. ఇందులో భాగంగా స్మశాన వాటిక, శెక్రిగేషన్ షేడ్, డంపింగ్‌యార్డ్, పల్లె ప్రకతి వనం, గ్రామ నర్సరీ, క్రీడా ప్రాంగణా లను ఆయన పరిశీ లించారు. మొదట శ్మశాన వాటికను పరిశీ లించిన ఆయన వీలైనంత త్వరలో ప్రజలకు అందు బాటు లోకి తీసుకురావాలని స్థానిక సర్పంచ్ అశోక్‌కు సూచించారు. తడి చెత్త పొడి చెత్త సేకరణ కేంద్రాన్ని పరిశీలించిన అందులో తయారుచేసే కంపోస్టును గ్రామపంచాయతీ పరిధిలో నాటిన ముక్కలకు ఉపయో గించాలని, అనంతరం పల్లె ప్రకతి వనాన్ని పరిశీలించి పల్లె ప్రకతి వనాన్ని సుందరీకరించిన తీరు, పళ్ళ ముక్కలు పెంచిన విధానాన్ని అందులో ఉన్న ఆహ్లాదకర వాతావరణాన్ని పరిశీలించిన ఆయన స్థానిక సర్పంచ్, కార్యదర్శిని అభినందిం చారు. కార్యక్ర మంలో వెంకయ్య, శ్రీనివాస్, మంజుల, భాగ్యలక్ష్మి, నాయకులు టీఆర్ఎస్ పార్టీ మంగపేట అధ్యక్షులు లక్ష్మినారాయణ, ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య, వీరమల్లు, తుమ్మ మల్లారెడ్డి, బొచ్చు సమ్మయ్య, తాహర్ పాషా పాల్గొన్నారు.
క్రీడామైదానాలను ఆటలకుఅనుకూలంగా తయారు చేయాలి
మంగపేట : మండలంలోని క్రీడా మైదా నాలను ఆటలకు అనుకూలంగా తయారు చేసి సిద్దంగా ఉంచాలని కలెక్టర్ కష్ణ ఆదిత్య అధికారుల ను ఆదేశించారు. శుక్రవారం మండలంలో పర్యటిం చిన ఆయన రాజుపేట, రమణక్కపేట గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. రాజుపేట క్రీడా మైదానం పరిశీలించిన కలెక్టర్ మైదానంలో మొరం పోసి ఆటలకు సిద్దంగా చేయాలని అధికారు లను ఆదేశించారు. పక్కనే ఉన్న జీసీసీ పెట్రోల్ బంక్‌ను సందర్శించి బంక్‌లోని స్టాక్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఖరీఫ్‌లో రైతుల అవస రాల మేరకు డీజిల్, పెట్రోల్ స్టాక్ అందు బాటులో ఉండేలా చూసుకోవాలని బంక్ సిబ్బందిని ఆదేశించారు. అక్కడ నుండి రమణక్కపేట అంగన్ వాడీ కేంద్రాన్ని చేరుకుని విద్యార్థుల హాజరుపై టీచర్ ను అడిగితెలుసుకున్నారు. అంగన్ వాడీ సెంటర్లో రిపేర్లు వెంటనే చేయించాలని ఎంపిడిఓను ఆదేశించారు. అక్కడ నుండి తహసీల్దార్ కార్యాల యం చేరుకున్న కలెక్టర్ కార్యాలయంలో పల్లెప్రగతి, రెవెన్యూ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి తుల రవి, తహసీల్దార్ మహ్మద్ సలీం, ఎంపిడిఓ కర్నాటి శ్రీధర్, ఆర్ఐ పోరిక సునీల్ కుమార్, పీఆర్ ఏఈ పాడి వాసు, గ్రామపంచాయతీ కార్యదర్శులు ఉపేంద్ర, యాదవరాజ్, రెవెన్యూ కార్యదర్శులు పాల్గొన్నారు.