Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుపేద కుటుంబాలకు ఇవ్వాలని ప్రజాసంఘాల ఆందోళన
నవతెలంగాణ-ఆత్మకూరు
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులకే దళితబంధు ఇస్తూ అసలైన నిరుపేద కుటుంబాలకు ఇవ్వక పోవడం సిగ్గుచేటని ఎమ్మార్పీస్ మండల అధ్యక్షుడు మంద చంద్రమోహన్ అన్నారు. ఆత్మకూరులో శుక్రవారం 163 నేషనల్ హైవే పై దాదాపు 100 మంది కూర్చొని ఎమ్మెల్యే ధర్మారెడ్డి కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అర గంటకు పైగా నిరసన తెలియజేయడంతో కిలోమీటర్ పొడవునా వాహనాలు బారులు తీరాయి. ధర్నా దగ్గరకు ఎసై సుమన్ పోలీస్ సిబ్బందితో హుటాహుటిన చేరుకొని నిరసన కారులను శాంతింపచేశారు. అనంతరం ఎంపీడీఓకు మెమోరాండం ఇచ్చారు. గతం లో పరిపాలించిన ప్రభుత్వాలు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు,ఉపాధి హామీ పార్టీల జోక్యం లేకుండా ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి మొదటగా ఇచ్చే వారని కాని ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ పరంగా ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలను ఎంపికచేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఎమ్మార్పీస్ మండల నాయకులు తనుగుల కుమార్, కొమ్ము శ్రీను, కుమార్, బరిగేలా కుమారస్వామి, సిలువేరు రాజు, మడిపెల్లి రాజు, బందెల ఎల్లమ్మ, తనుగుల సందీప్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.