Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్
- నిరుద్యోగులపై కాల్పులను నిరసిస్తూ రాస్తారోకో
- గార్ల వాసికి బుల్లెట్ గాయం
నవతెలంగాణ-ములుగు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని దేశ వ్యాప్తంగా నిరుద్యోగ యువకులు నిరసన చెస్తూంటే నిరుద్యోగులపై కాల్పులు జరపడం దుర్మార్గమైన చర్య అని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ దేశంలో సార్వభౌమాధికారాన్ని రక్షించాలని సైన్యంలోకి కాంట్రాక్ట్ సైనికులను తీసుకునే విదానాన్ని ప్రవేశపెట్టే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని ఇప్పటికే సైన్యంలో రవాణా రంగాన్ని నిర్మాణ రంగాన్ని వైద్య రంగాన్ని ప్రైవేటు పరం చేయడం జరిగిందన్నారు. ఉన్న సైనిక భర్తీ వ్యవస్థను కూడా కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలనుకోవడం చాలా సిగ్గుచేటైన విషయమని అన్నారు. నాలుగేళ్ల కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిలో సైనికుల రిక్రూట్మెంట్ ను రద్దు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెన్షన్ డబ్బు ఆదా తీసుకోవడం కోసం కేంద్రం కుయుక్తులు చేస్తుందని వారు అన్నారు. ఆర్ ఆర్ బి పరీక్షలు నిర్వహించి, అగ్నిపథ్‌ను రద్దు చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న యువత పై లాఠీఛార్జ్ చేసి తుపాకులతో కాల్చడం దేశంలో మోడీ పాలన ఎలా ఉందో అర్థం అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయ ఎక్స్‌గ్రేషి యా ఇవ్వాలి, గాయాలైన వారికి కేంద్ర ప్రభుత్వం నాణ్యమైన వైద్యం అందించాలని హెచ్చరించారు. కార్యక్రమంలో డివై ఎఫ్ఐ టౌన్ నాయకులు వేణు, నాగరాజు, జోగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
గార్ల : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 'అగ్నిపధ్' పథకం నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని తక్షణమే ఈ అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని సిపిఎం మండల నాయకులు వంగూరి వెంకటేశ్వర్లు, ఇమ్మడి గోవింద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ విధానం వలన వృత్తి నైపు ణ్యాలతో కూడిన సా యుధ బలగాల సామర్ధ్యాన్ని పెంచడం సాధ్యం కాదన్నారు. అందోళనలో సిపిఎం నాయకులు కె.ఈశ్వర్ లింగం, అలవాల రామకష్ణ, మౌలానా, జె.శ్రీను, వీరభద్రం, పద్మ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుక వచ్చిన అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ విధానాన్ని మోడి తక్షణమే రద్దు చేయాలని న్యూడె మోక్రసి మండల కార్యదర్శి జడ సత్యనారాయణ, పివైయల్ నాయకులు గౌని భద్రయ్య లు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కుసిని బాబు రావు, నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఆశ చూపి నిరుద్యోగుల ప్రాణాలు కోల్పోయే విధంగా అగ్ని పథ్ పధకాన్ని ప్రవేశ పెట్టారని సిపిఐ రాష్ట్ర నాయకులు కట్టె బోయిన శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమం లో నాయకులు జె.వెంకన్న, వెంకటేష్ తదితరులు పాల్గొ న్నారు. అగ్ని పథ్ పధకాన్ని తక్షణమే రద్దు చేసి పాత పద్దతి లో సైనిక రిక్రూట్ మెంట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధనియాకుల రామారావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపిటీసి మాళోత్ వెంకట్ లాల్, నాయకులు జి.శ్రీను, కృష్ణ, వశ్యా,భీముడు తదితరులు పాల్గొన్నారు.
రైల్వే స్టేషనులో భారీ బందోబస్తు ఏర్పాటు
సికింద్రాబాద్‌లో రైల్వే స్టేషన్లో నిరుద్యోగులు చేపట్టి న అందోళన ఉద్రిక్త కంగా మారి కాల్పులు జరిగిన నేపథ్యం లో జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్దానిక రైల్వే స్టేషనులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై బానోత్ వెంకన్న అధ్వర్యంలో పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేశారు.
తొర్రూరు : అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని, ఆర్మీలో కొత్త కాంట్రాక్టు రిక్రూట్మెంట్ విధానాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో నిరుద్యోగుల నిరసన సందర్భంగా పోలీసులు కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకోవడం దుర్మార్గమైన చర్య అని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బందు మహేందర్ శుక్రవారం డిమాండ్ చేశారు. నిరుద్యోగ అభ్యర్థులపై కాల్పులు జరిపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని అన్నారు చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామ అన్నారు.
నెల్లికుదురు : అగ్నిపత్ స్కీంను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి పెరుమాళ్ళ తిలక్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండల కేంద్రంలో హైదరాబాదులో నిరుద్యోగ యువత పై జరిగిన లాఠీఛార్జి కాల్పులకు నిరసనగా మండల కేంద్రం లోని అంబేద్కర్ సెంటర్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటు వంటి విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు బాబు గౌడ్, సైదులు,యాకయ్య, ఐలయ్య, వెంకన్న, రమేశ్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.