Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
ప్రయాణికులకు వర్షపు నీటితో అసౌకర్యం కలుగకుండా బస్టాండ్లో వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలను వరంగల్ కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులను ఆదేశించారు. శుక్రవారం వరంగల్ బస్టాండ్ పరిసర ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, సంబంధిత ఆర్టీసీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. బస్టాండ్ ఆవరణలో వర్షపు నీరు నిలువ ఉండడాన్ని గమనించిన ఆయన డ్రైనేజీ నిర్మాణం పూర్తయితే వర్షపు నీరు నిల్వ ఉండదని డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయడంతోపాటు ప్రయాణికుల కోసం డ్రింకింగ్ వాటర్ సంపు కూడా ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు ద్వారా నిత్యం అనేక మంది ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు చేరుకుంటారని వారికి ఎలాంటి అసౌకర్యం కాకుండా బస్టాండ్ ఆవరణలో అపరిశుభ్రత వాతావరణం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్టీసీ డివిఎం రమేష్ బాబు, డిఎం సత్యనారాయణ, హనుమకొండ డిఎం బుచ్చయ్య, అధికారులు. ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.