Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై, వైద్యు లపై నమ్మకం కల్పించాలని పిహెచ ్సిలు, సబ్ సెంటర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్స్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నా రు. శుక్రవారం కలెక్టర్ తాడ్వాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ నిలువ గది, ఎక్స్ రే గది నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై కలెక్టర్ డిప్యూటీ డిఎంహెచ్వో కోరం క్రాంతి కుమార్, మెడికల్ ఆఫీసర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది హాజరు పట్టిక, మూమెంట్ రిజిస్టర్, అటెండెన్స్ యాప్ నమో దు, రోజువారి ఓ.పి. అందిస్తున్న మందుల విషయం, ఔషదాలు ఇచ్చిన తర్వాత ఈ- ఔషదలో నమోదు చేస్తున్న రికార్డులు పరిశీలించారు. కలెక్టర్ పిహెచ్ సీలో బి.పి., షుగర్ చెక్ చేయించుకున్నారు. ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేపట్టి ఆసుపత్రి ని పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో క్రాంతి కుమార్, మెడికల్ ఆఫీసర్ నవ్య, ఫార్మాసిస్టర్, స్టాఫ్ నర్సు తదితరులు పాల్గొన్నారు.