Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రబెల్లిలో ఘణంగా బడిబాట
- సర్పంచ్ కవిత రాజ్‌కుమార్, హెచ్ఎం మాధవి
నవతెలంగాణ-వేలేరు
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తోందని ఎర్రబెల్లి సర్పంచ్ గూడ కవిత రాజ్‌కుమార్, హెచ్ఎం మాధవి తెలిపారు. మండలంలోని 3 ప్రభుత్వ ప్రాథమిక, హైస్కూళ్ల ఉపాధ్యాయులు ఆ గ్రామంలో శనివారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్రభుత్వ పాఠశాలల ఔన్నత్యం ఉట్టిపడేలా డీజే పాటలతో ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కవిత రాజ్‌కుమార్, హెచ్ఎం మాధవి మాట్లాడారు. బడీఈడు పిల్లలు ప్రభుత్వ బడుల్లో చేరాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు అధికంగా, చదువులు అరకొరగా ఉంటాయని తెలిపారు. ఉచితంగా విద్యాబోధనతోపాటు పాఠ్యపుస్తకాలు, భోజన వసతి ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బానోత్ విజయలక్ష్మి రాజశేఖర్, వార్డు సభ్యుడు భాస్కర్, సీఆర్పీ మొగిలిచెర్ల శ్రీనివాస్, ఎస్ఎంసీ చైర్మెన్లు, అయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆనందం, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.