Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మట్టెవాడ : రాకేష్ మృతికి నిరసనగా టిఆర్ఎస్ నాయకులు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్ర మాలు చేపట్టారు. టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు జెండాలు పట్టుకొని వరంగల్ రైల్వే స్టేషన్ బయట కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ లోకి చొర బడేందుకు ప్రయత్నించిన కార్యకర్తలపై ఇంతే జార్ గంజ్ సిఐ మల్లేష్ ఇతర పోలీసు సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. గుంపులుగా ఉన్న వారిని చదర కొట్టి ఆందోళనకారులను పోలీసు వాహనంలోకి ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.