Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యానవన శాఖ అధికారి అక్బర్
నవతెలంగాణ-రేగొండ
ఆయిల్ ఫామ్ పంట సాగు చేస్తే అధిక లాభాలుంటాయని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎంఏ అక్బర్ తెలిపారు. మండలంలోని రేగొండ, దమ్మన్నపేట, కనపర్తి గ్రామాల్లోని రైతు వేదిక భవన్లో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు అక్బర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆయిల్ పామ్ పంట సాగుకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, అనువైన పరిస్థితులు, నీటి వసతులపై రైతులకు అవగాహన కల్పించారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల అనుమతులు ఇచ్చాయని చెప్పారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందడానికి వీలు ఉంటుందని తెలిపారు. పంటకు చీడపీడలు దరిచేరవని చెప్పారు. పంట సాగు చేసే రైతులకు ఉద్యానవన శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మొక్కలకు 85 శాతం రాయితీ ఇస్తోందన్నారు. అలాగే అంతర పంటలకు రాయితీతో ఎరువులు, డ్రిప్ పరికరాలను అందిస్తున్నట్టు తెలిపారు. రైతులు అంతర పంటల ద్వారా మొదటి నాలుగేండ్ల వరకు ఆదాయాన్ని పొందవచ్చని వివరించారు. ఆయిల్ పామ్ సాగుకు రైతులు మొగ్గు చూపాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు నిశిధర్‌రెడ్డి, సుధాకర్, శ్రీనివాస్‌రావు, డీఏఓ విజరుభాస్కర్, ఉద్యానవన శాఖ అధికారి సునీల్ కుమార్, ఏఓ వాసుదేవరెడ్డి, సువేన్ అగ్రో ఇండిస్టీ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి యుగంధర్, ఎంపీటీసీ శ్రీధర్‌గౌడ్, ఏఈఓలు లత, సునీల్, రణధీర్, తదితరులు పాల్గొన్నారు.