Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీగల్ కౌన్సిలర్ శ్రీదేవి
నవతెలంగాణ-శాయంపేట
మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని లీగల్ కౌన్సిలర్ శ్రీదేవి కోరారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్లో హెచ్ఎం వెంకటేశ్వర్రావు అధ్యక్షతన సఖి కేంద్రం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీదేవి పాల్గొని మాట్లాడారు. సఖి వన్ స్టాప్ సెంటర్ ఉద్దేశాలు, అందిస్తున్న సేవలను వివరించారు. సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్, మహిళా అభివద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖి కేంద్రాలు నడుస్తున్నాయని చెప్పారు. వాటి ద్వారా బాధిత మహిళలకు కౌన్సిలింగ్, వైద్య, పోలీస్ సహాయం, తాత్కాలిక వసతి, న్యాయ సహాయం అందుతాయని తెలిపారు. గహహింస, లైంగిక వేధింపులు, అత్యాచారాల నుంచి రక్షణ కోసం సఖి పని చేస్తుందన్నారు. సమస్య తలెత్తినప్పుడు 181 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేస్తే తక్షణమే స్పందిస్తారని, రక్షణ లభిస్తుందని తెలిపారు. అలాగే 0870-2452112 నెంబర్కు ఫోన్ చేసి బాధిత మహిళలకు సాయం అందుతుందని చెప్పారు. సమావేశంలో కేర్ వర్కర్ హరిత, వీఓఏ స్వరూపరాణి, అధ్యక్షురాలు అనురాధ, కార్యదర్శి నీరజ, కోమల, హరిత, కవిత, తదితరులు పాల్గొన్నారు.