Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
2012లో వచ్చిన వివాహ నమోదు చట్టం ప్రకారం మండలంలోని దుబ్బపేట గ్రామ పంచాయతీలో అజ్మీర స్వప్న, సారయ్య దంపతుల కూతురు శ్రీలత వివాహాన్ని శనివారం నమోదు చేశారు. శ్రీలత వివాహ నమోదు కోసం ఇటీవల దరఖాస్తు చేయగా శనివారం సర్పంచ్ అజ్మీరా ప్రమిల రాజునాయక్, పంచాయతీ కార్యదర్శి చల్ల ప్రవీణ్ ఆమెకు వివాహ నమోదు సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పటివరకు ఐదుగురికి వివాహ నమోదు సర్టిఫికెట్లు అందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.