Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కడియం, ఎమ్మెల్యే ధర్మారెడ్డి
- లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ
నవతెలంగాణ-పరకాల
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన పలువురు లబ్దిదారులకు రూ.3.61 కోట్ల విలువైన కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్సీ శ్రీహరి, ఎమ్మెల్యే ధర్మారెడ్డి శనివారం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ శ్రీహరి, ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడారు. పేదలను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.