Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ, మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండా ప్రకాష్
నవతెలంగాణ-రఘునాథపల్లి
ముదిరాజ్ కులస్తుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్సీ, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండా ప్రకాష్ తెలిపారు. మండలంలోని మండలగూడెంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య అధ్యక్షతన శనివారం జరిగిన జిల్లా విస్తతస్థాయి సమావేశానికి ప్రకాష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత పాలకుల హయాంలో ముదిరాజ్ కులస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత ముదిరాజ్ కులస్తుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఏటా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తూ చేయూత అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి కట్ల సదానందం, ఉత్తరపు సత్యనారాయణ, వైస్ చైర్పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి, సర్పంచ్ ఉత్తపు ఉమారాణి, జిల్లా అధ్యక్షురాలు రేఖ, తదితరులు పాల్గొన్నారు.