Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్ ఘనపూర్
ప్రజాసమస్యల పరిష్కారానికి అందరూ సహకరించాలని జిల్లా పశువైద్య అధికారి నర్సయ్య, శివునిపల్లి ప్రత్యేకాధికారి కుమారస్వామి కోరారు. పల్లె ప్రగతి ముగింపు సందర్భంగా పంచాయతీ కార్యదర్శి చిరుంజీవి అధ్యక్షతన శనివారం నిర్వహించిన సభలో వారు మాట్లాడారు. ప్రజలు చెత్తను తడి, పొడిగా వేరు చేయడాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పచ్చదనం, పరిశుభ్రతలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అనేక సమస్యలను గుర్తించి 15 రోజుల్లో పరిష్కారం కోసం పాటుపడినట్లు చెప్పారు. అనంతరం పల్లె ప్రగతిలో కృషి చేసిన సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గుర్రం రాజు, బూర్ల లత శంకర్, వార్డు సభ్యుడు బూర్ల విష్ణు, ఎంపీఓ సుధీర్‌కుమార్, ఏఓ చంద్రన్ కుమార్, సిబ్బంది రాజు, లాజర్, వినరు, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.