Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం
నవతెలంగాణ-జనగామ
ఆర్టీసీ ఛార్జీల పెంపును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘం జిల్లా కమిటీ ఆద్వర్యంలో ఆర్టీసీ డిపో వద్ద డిపో కంట్రోలర్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి సాదిక్ ఫౌండేషన్ ఫౌండర్, న్యాయవాది సాదిక్ అలి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ధర్మభిక్షం, సాదిక్ అలీ మాట్లాడారు. ఆర్టీసీ బస్‌పాస్ ఛార్జీల పెంపు సరికాదన్నారు. రాష్ట్రంలో మార్చి నుంచి ఇప్పటివరకు మూడు సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచి ప్రజలపైన పెనుభారం మోపారని మండిపడ్డారు. బస్‌పాస్ చార్జీలు 150 శాతం పెరిగాయని చెప్పారు. బస్‌పాస్ ఛార్జీల పెంపు వల్ల పేద గ్రామీణ విద్యార్థుల చదువుపై దుష్ప్రభావం పడుతోందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రవిందర్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.