Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
పల్లె ప్రగతిలో ముఖ్య భూమికను పోషించే పాడి రైతులు తమ పశువులకు కృత్రిమ గర్భాధారణ ద్వారా పశువులలో జన్యు లక్షణాల అబివృద్ధి పాడి పశువుల పెంపకంపై మండలంలోని కమలాపురంలో అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. సదస్సుకు హాజరైన తెలంగాణ రాష్ట్ర పశుగణాభివద్ధి సంస్థ చైర్మన్ చెలిమెడ రాజేశ్వరరావు మాట్లాడుతూ పల్లె ప్రగతికి పశుపోషణ ముఖ్యమైందన్నారు. పశుపోషణలో ముఖ్య భూమికను పోషిస్తున్న సన్న చిన్నకారు రైతులు వ్యవసాయ కూలీలు వారి జీవనోపాదికి దేశవాళీ ఆవులను ఉత్తమ జాతి ఆవులను పెంచుకుంటున్నారన్నారు. వారు పాడి పశువులలో జన్యు లక్షణాల మెరుగుదలకు అనుసరించే సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. కృత్రిమ గర్భాదారణ నిర్వహించడానికి పశువులలో ఎద లక్షణాలు గమనించి సమీప పశు వైద్యశాలలో, గోపాల మిత్రల ద్వార పశువులకు అనువైన కృత్రిమ గర్బాధారణ చేయించి పశుజాతి అభివృద్ధికి పాటు పడాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మంజువాణి, డాక్టర్ విజయ భాస్కర్, డాక్టర్ రఘుబాబు, చింతకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కె.నాగేశ్వర్ రావు, ఉమ్మడి భూపాలపల్లి జిల్లా గోపాల మిత్రలు, రైతులు పాల్గొన్నారు.