Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాల యధావిధిగా నడిచేలా చర్యలు తీసుకోవాలి
- కాంగ్రెస్ రాష్ట్ర నేత గండ్ర సత్యనారాయణరావు
- 'నవతెలంగాణ' కథనానికి స్పందన
నవతెలంగాణ-శాయంపేట
మండలంలోని ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు చేరేలా, తరగతులు యదావిధిగా నడిచేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత గండ్ర సత్యనారాయణరావు కోరారు. 'ఆరెపల్లి ప్రాథమిక పాఠశాల భవిష్యత్తు ప్రశ్నార్థకమే' అనే శీర్షికతో 'నవతెలంగాణ'లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి పాఠశాలను శనివారం పాఠశాలను సందర్శించి పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలో అదనపు తరగతి గది నిర్మాణం కోసం తవ్వి వదిలేసిన గుంతలను గమనించారు. అనంతరం గండ్ర సత్య నారాయణరావు మాట్లాడారు. కాంట్రాక్టర్ మూడు నెలలుగా పనులు చేయకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు రావడం లేదన్నారు. ఉపాధ్యాయుడు వచ్చి వెళ్తుండటంతో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో మూతపడనున్న పాఠశాలలను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ ముందుగానే గుర్తించి అధికారులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికైనా పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకొని ప్రభుత్వ బడిని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బుచ్చిరెడ్డి, కష్ణమూర్తి, రవి, రవీందర్, క్రాంతి, రమేష్, మార్కండేయ, తదితరులు పాల్గొన్నారు.