Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కేంద్రం' తీరుతో జాతి ప్రయోజనాలకు దెబ్బ
- సీపీఐ(ఎం) జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి
- రాస్తారోకో, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం
నవతెలంగాణ-హనుమకొండ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'అగ్నిపధ్' పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పేరుతో చేపట్టిన చర్యతో జాతి ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ఆ పార్టీ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్లో శనివారం రాస్తారోకో నిర్వహించగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు జిల్లా కమిటీ సభ్యుడు వాసుదేవరెడ్డి నిప్పు పెట్టి దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడారు. నాలుగేళ్ల స్వల్ప కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను రిక్రూట్ చేయడం వల్ల వత్తి నైపుణ్యాలతో కూడిన సాయుధ బలగాల సామర్ధ్యాన్ని పెంచడం సాధ్యం కాదన్నారు. పెన్షన్ డబ్బును ఆదా చేసుకోవడం కోసం పథకాన్ని తీసుకురావడం సాయుధ దళాల నైపుణ్యం, సామర్ధ్యంపై రాజీపడడమేనని స్పష్టం చేశారు. రెండేండ్లుగా సైన్యంలో రిక్రూట్మెంట్ లేదని గుర్తు చేశారు. సాయుధ బలగాల్లోకి రెగ్యులర్ సైనికులను రిక్రూట్ చేసుకోవడానికి బదులు అగ్నిపథ్ పథకాన్ని తీసుకురావడం వల్ల కాంట్రాక్టు సైనికులు నాలుగేండ్ల సర్వీస్ తర్వాత ఉపాధి అవకాశాలకు నోచుకోలేని దుస్థితి నెలకొంటుందని ఆందోళన వెలిబుచ్చారు. ప్రైవేట్ మిలీషియాగా పని చేసే ప్రమాదం ఉందన్నారు. అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే రద్దు చేసి సాయుధ బలగాల్లోకి రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేపట్టాలని, సికింద్రాబాద్ కాల్పులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వాంకుడోతు వీరన్న, భానునాయక్, దొగ్గెల తిరుపతి, ప్రజాసంఘాల జిల్లా నాయకులు టి ఉప్పలయ్య, గొడుగు వెంకట్, నాయకులు కుక్కమూడి రవి, వల్లెపు రాజు, కడారి సుదర్శన్, శ్రీను, రమాదేవి, ఉమ, కవిత, స్వరూప, భాగ్య, పద్మ, రజిత, రాంబాబు, రాజేష్, సరిత తదితరులు పాల్గొన్నారు.
అదాలత్ సెంటర్లో... : సీపీఐ(ఎం) హనుమకొండ సౌత్ మండల కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు, సౌత్ మండల కార్యదర్శి మంద సంపత్ మాట్లాడారు. కార్యక్రమంలో అలకుంట్ల యకయ్య, దూడపాక రాజేందర్, మేకల రఘుపతి, బొల్లారం సంపత్, కంచర్ల కుమారస్వామి, ఎన్నాం వెంకటేశ్వర్లు, దాసరి నరేష్, సంధ్య, కావ్యశ్రీ, తదితరులు పాల్గొన్నారు.
ఐనవోలు : మండల కేంద్రంలోని తెలంగాణ విగ్రహం వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య మాట్లాడారు. కార్యక్రమంలో ముల్కలగూడెం సర్పంచ్ బండి పర్వతాలు, నాయకులు ధీకొండఉప్పలయ్య, రాయపురం కొమురయ్య, ఏలియా, వరికల గోపాల్రావు, తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి : సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాజీవ్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న మాట్లాడారు. కార్యక్రమంలో వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి సోమ సత్యం, కేవీపీఎస్ మండల కార్యదర్శి బాణాల వెంకన్న, కాకర్ల రమేష్, సీఐటీయూ నాయకులు అంబటి సోమయ్య, షేర్ సమ్మయ్య, గాదెపాక కొమురయ్య, మహబూబ్, ఎల్లయ్య, పరశురాములు, రాజు, తదితరులు పాల్గొన్నారు.