Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
ఈనెల 30వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించే కేవీపీఎస్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తూటి దేవదానం పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో ఆ సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం పల్లెర్ల లలిత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో దేవదానం పాల్గొని మాట్లాడారు. కేవీపీఎస్ 1998 అక్టోబర్ 2నఅవిర్భవించిందన్నారు. నాటి నుండి నేటి వరకు జిల్లా లో అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు. దళితుల సమస్యలు పరిష్కరించాలని జేస్టిస్ పున్నయ్య కమిషన్ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించిందన్నారు. దళితులకు 1235జీవో, దళితుల స్మశనవాటిక, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సాధించడంలో కేవీపీఎస్ అలుపెరగని పోరాటాలు నిర్వహించిందన్నారు. రాబోవు కాలంలో దళితులు, గిరిజనులు, బహుజనుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు రూపుదిద్దుకోవడానికి జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు, సంఘం నాయకులు, కార్యకర్తలు అభిమానులు మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు గడ్డం యాదగిరి, పల్లెర్ల శంకర్, మబ్బు ఉప్పలయ్య, చిలుముల్ల భాస్కర్, శాగ సంబరాజు, కలకోట ప్రభాకర్, మంద మహేందర్, బాణాల వెంకన్న, మరపక రమేష్, కాకర్ల బాబు, మబ్బు వెంకటేష్, శోభ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.