Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సింహులపేట
దళితులందరికీ దళితబంధు ఇవ్వకుంటే సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఫలితాలు చూడాల్సి వస్తుందని కేవీపీఎస్ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్ర మహేష్ హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ధర్నా చేసి ఆర్ఐ సైదులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం దళితులకు హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. దళితులకు ముఖ్యమంత్రి మూడు ఎకరాల భూమి, డబల్ బెడ్రూమ్ ఇల్లు, కేజీ టు పీజీ, ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు తదితర అనేక హామీలిచ్చి అమలు చేయట్లేదన్నారు. ప్రభుత్వాల డబ్బులతో భూములు కొనుగోలు చేసి ఇస్తామన్నముఖ్యమంత్రి నేడు విస్మరించారన్నారు. పేదల చేతిలో ఉన్న పోరంబోకు పంచరాయి భూములు లాక్కొని ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తున్నారన్నారు. దళిత బంధు పథకాన్ని ఎమ్మెల్యేలు ఎంపిక చేసి ఇవ్వడం విడ్డూరమన్నారు. దళితబంధుకు మార్గదర్శకాలు లేవన్నారు. కలెక్టర్ల ఎంపిక విధానం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గునిగంటి మోహన్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సైదులు, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల యాకుబ్, కేవీపీఎస్ నాయకులు నవీన్, యాకయ్య, మధు తదితరులు పాల్గొన్నారు.