Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ వెంకట్ నర్సింగరావు, దాత రామడుగు ఆనంద్
నవతెలంగాణ-జఫర్గడ్
గ్రామ ప్రజల సౌకర్యార్థం నిర్మించిన వాటర్ ప్లాంట్ను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ బల్లెపు వెంకట్ నర్సింగరావు, దాత రామడుగు ఆనంద్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పాత గ్రామపంచాయతీలో వెయ్యి లీటర్ల సామర్థ్యం గల వాటర్ ప్లాంట్ను దాత దాత రామడుగు ఆనంద్ గ్రామ ప్రజలతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల హామీలో భాగంగా జఫర్గడ్ గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సేవ చేయాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజలకు సహకరిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ మాజీ చైర్మెన్ అన్నెబోయిన బిక్షపతి, మాజీ సర్పంచ్ మోహన్రావు, కో ఆప్షన్ సభ్యులు ఎండీనజీర్, దామిశెట్టి రామయ్య, ఎంపీటీసీజ్యోతి రజిత యాకయ్య, వార్డు సభ్యులు సంగ శివరాజ్, కాట సుధాకర్,కుక్కల సారంగం, ఉప్పలయ్య, లతా యాదగిరి, అయిషా బేగం, పంచాయితీ సెక్రటరీ రాజేశ్వర్ సార్, కారోబార్ వివేక్ పాల్గొన్నారు.