Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాడి గేదె మృత్యువాత : బాధితుడు
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
పశువెద్యాధికారుల నిర్లక్ష్యం వల్లే తన పాడిగేదె మృత్యువాత పడిందని బాధితుడు మండలంలోని వెలికట్ట గ్రామానికిచెందిన కొమ్ము సోమయ్య ఆరో పించాడు. సోమవారం వైద్యం కోసం పశువైద్యాధి కారిని సంప్రదిం చగా నిర్లక్ష్యంగా వ్యవహరించి రాక పోవడంతో సకాలంలో వైద్యం అందక గేదె మత్యువాతపడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సదరు పశు వైద్యాధికారిపై సంబంధిత జిల్లా అధి కారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై జిల్లా కలెక్టర్కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సుమారు రూ.90 వేల విలువైన గేదె మృత్యువాతపడిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు.