Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
బాసర ఐఐటీ విద్యార్థులకు మద్దతుగా 21న జరిగే ఛలో బాసరను విద్యార్థులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పట్ల మధు డిమాండ్ చేశారు. సోమవారం మహబూబాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మధు మాట్లాడారు. గత ఏడు రోజులుగా బాసర ఐఐఐటీలోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని దీక్ష చేస్తున్నా సీఎం కేసీఆర్ స్పదించకపోవడం సిగ్గు చేటన్నారు. శాంతియుతంగా దీక్ష చేసుండగా విద్యుత్, నీరు నిలిపివేసి విద్యార్థులను ఇబ్బందికి గురిచేస్తున్నారన్నారు. అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత విద్యార్థులను చిన్న చూపు చూసేలా మాట్లాడుతున్నారన్నారు. బాసర విద్యార్థులకు మద్దతుగా విద్యార్థి లోకం ఛలో బాసరకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి జ్యోతిబసు, ఉపాధ్యక్షుడు నవీన్, మండల అధ్యక్ష, కార్యదర్శులు వీరెందర్ నాయకుల కళ్యాణ్, సాయిపతి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.