Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ నాగిరెడ్డి
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ నల్ల నాగిరెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని పలు పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీ ఫ్లోర్ లీడర్ పూస్కూరి శ్రీనివాసరావు పాల్గొని విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహాత్మ హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు గంట రవీందర్, వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు తక్కలపల్లి రవీంద్ర లతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి పోతుగంటి నరసయ్య, వందేమాతరం ఫౌండేషన్ బాధ్యులు చిదురాల కష్ణమూర్తి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.