Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు వ్యతిరేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కు బుద్ది చెప్పాలి
- కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క,
- కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి
నవతెలంగాణ-ములుగు
దేశం అభివృద్ధి చెందాలంటే దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ జాతీ య నేత ఎమ్మెల్యే సీతక్క, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డిఎల్ఆర్ గార్డెన ్లో జరిగిన చింతన్ షివిర్ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ రాజకీయాలు, సామాజిక న్యాయం-సాధికారికత, సంస్థాగత వ్యవహారాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, రైతులు-రైతు కూలీలు, యువతకు సం బంధించి విషయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. ప్రజా సమస్యలపై పార్టీ నిర్మాణం చేసుకుంటూ గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వాలను గద్దె దింపాలి, అగ్నిపథ్ నిర్ణయంతో యువకులు ప్రాణాలు కోల్పోతున్నా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోకపోవడం దారుణం అని సీతక్క ధ్వజమెత్తారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి రవళి రెడ్డి, కార్యదర్శి పైడకుల అశోక్, యూత్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి వంచ రామ్మోహన్ రెడ్డి, అనిల్, ప్రొఫెసర్ అశోక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెళ్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాం రెడ్డి, ఆక రాధాకష్ణ, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి భగవాన్ రెడ్డి, వెంకన్న, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొమురం ధన లక్ష్మి, ఫిషర్మెన్ జిల్లా అధ్యక్షులు రవి, పాల్గొన్నారు.