Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ-పెద్దవంగర
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నద న్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. దళితుల అభ్యున్నతి కోసమే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 వందల మంది దళితులకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందిస్తుందన్నారు. రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన వారికి నూతన పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్ నూతన పెన్షన్లను ప్రకటిస్తార న్నారు. సొంత స్థలం కలిగి ఉన్న ఇల్లు లేని పేదలకు రూ.3లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి, గడప గడపకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పాలకుర్తి దేవస్థానం చైర్మెన్ రామచంద్రయ్య శర్మ, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు జాటోత్ నెహ్రు, సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, సోమనరసింహరెడ్డి, యాదగిరి రావు, ముత్తినేని శ్రీనివాస్, బానోత్ వెంకన్న, ఎండీ ముజీబ్, ఎంపీటీసీ శ్రీనివాస్, మండల యూత్ అధ్యక్షుడు కాసాని హరీష్, లింగమూర్తి, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు చిలుక బిక్షపతి, ఉపాధ్యక్షులు ఎర్ర వెంకన్న, జ్ఞానేశ్వర చారి, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమాజ వికాసానికి చదువు దోహదపడుతుంది
తొర్రూరు : చదువు వ్యక్తిత్వ వికాసానికి, సమాజ వికాసానికి దోహద పడుతుందని, అభివద్ధికి బాటలు వేస్తూ సామాజిక గౌరవాన్ని కలిగిస్తుందని, చదువు ఒక్కటే మనిషిని సమున్నత స్థాయికి చేరుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు లోని అంబేద్కర్ కాలనీలో సోమవారం ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అధిక నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. అందరూ బాగా చదువుకొని అభివద్ధిలోకి రావా లని ఆకాంక్షించారు. 'మన ఊరు-మన బడి' కింద రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,289కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో వస తులు పెంచుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్ ఇప్పిస్తున్నామని అన్నారు. విదేశీ విద్య కోసం ప్రత్యేక పథకం పెట్టీ పేద విద్యార్థులను చదివిస్తున్నామన్నారు. తొర్రూరు అంబేద్కర్ కాలనీ లోని పాఠశాలలో లక్ష రూపాయలతో తాగునీటి సౌకర్యం, రూ.2లక్షల30వేలతో విద్యుద్ధీకరణ, రూ.3లక్షల52వేలతో గదుల మరమ్మతు, రూ.14 లక్షలతో బాలురకు, బాలికలకు వేర్వేరుగా టారులెట్స్, రూ.4లక్షలతో కిచెన్ షెడ్డు నిర్మాణా నికి నిధులు మంజూరు చేశామన్నారు. అదనపు తరగతి గదులు అడుగుతున్నారని, పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచితే అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మండల అభివృద్ధి కమిటీ చైర్మెన్ డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు, మున్సిపల్ చైర్మెన్ రామచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.