Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
'మన ఊరు-మన బడి'లో భాగంగా చేస్తున్న పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆదేశిం చారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధి కారులతో సమీక్షించి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 12 మండలాల నుండి మండలానికి రెండు పాఠశాల చొప్పున మొత్తం 24 పాఠశాలలను మన ఊరు-మన బడి కింద ఎంపిక చేశామని అన్నారు. రూ.30 లక్షల లోపు ఉన్న పనుల ను అంచనా వేయడం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. అంతకుమించి చేసే పనులకు టెండర్ల ప్రక్రియను కూడా ఈ నెలాఖరులోపు పూర్తి చేయా లన్నారు. నాణ్యతతో పనులు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, అబ్దుల్ హమీద్, డీఈఓ రాము, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.ప్రజా ఆర్జీలు సత్వరమే పరిష్కరించాలి.