Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఐదో పోలీస్ బెటాలియన్ ఏర్పాటులో భూములు కోల్పోయిన పేదలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం మండలంలో ఆయన చేపట్టిన యాత్ర 94వ రోజుకు చేరుకుంది. మొద ట చల్వాయిలో ఐదవ బెటాలియన్ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులు తమ సమస్యలను ప్రవీణ్ కుమార్ కు వివరించారు. భూనిర్వాసితులతో ఆయన మాట్లాడుతూ వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉండగా ఏళ్ల తరబడి రైతులు సాగు చేసుకుంటున్న సాగు భూములు లాక్కోవటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణిం చారు. చల్వాయిలో మొదట పెద్దమ్మతల్లి గుడిని దర్శించుకొని యాత్ర ప్రారంభించిన ప్రవీణ్ కుమార్ చల్వాయి గోవిందరావుపేట, పస్ర, నార్లపూర్, మేడారంలో యాత్ర కొనసాగింది. పోడు భూములకు పట్టాలు ఇవ్వ కుండా అడిగినవారికి జైలుకు పంపుతున్నారని, బీఎస్పీ పార్టీ మాత్రమే గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్టంలో పేదలకు చదువు, భూమి, ఇల్లు, నీరు ఏమీ దొరకడం లేదన్నారు. చదువుకోడానికి సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. అక్కడి విద్యార్థులు ఆరు రోజులుగా ఉద్యమిస్తున్నా పట్టిం చుకో వడం లేదన్నారు. పేదల బతుకులు మారాలంటే బీఎస్పీ పార్టీనే గెలిపించాలని కోరారు. గోవిందరావుపేటలో హమాలీ కూలీలతో కాసేపుముచ్చటించారు. వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుటుంబాలను సం దర్శించి వారిని పరామర్శించారు. పలు గ్రామాల్లో బీఎస్పీ పార్టీ జెండా ఆవష్కరించారు.గ్రామస్తులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.