Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బలుపు మాటలతో దేశ ప్రతిష్ట దిగజార్చుతున్న బీజేపీ
- విద్యార్థులను తీవ్రవాదులతో పోల్చడం సిగ్గుచేటు
- నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
హక్కులకై కొట్లాడితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ నిరు ద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో ఇటీవల సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన పోలీసు కా ల్పుల ఘటనపై బీజేపీ నాయకుల వాఖ్యలను ఎమ్మె ల్యే తీవ్రంగా ఖండించారు. బీజేపీ నేతలు బలుపు మాటలు మాట్లాడుతూ దేశ ప్రతిష్టను దిగజార్చు తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైనికులు బీజేపీ సెక్యూరిటీ గార్డుల్లా ఉండాలని, బట్టలు ఉతకాలని బేజేపీ దుర్మార్గంగా మాట్లాడుతున్నారన్నారు. 2018లో శాశ్వత ప్రాతిపదకన ఎంపికైన ఆర్మీ అభ్య ర్థులకు ఇటివల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ఎలా వర్తిస్తుందని అది తప్పని నిరసిస్తున్న నిరుద్యోగుల ప్రాణాలు తీశారని విమర్శించారు. నిరుద్యోగులు తీవ్రవాదులా లేదా గోద్రా అల్లర్లు చేసి ఊచకోత కో సారా అంటూ ప్రశ్నించారు. హక్కులను కాపాడాలని నిరసన తెలిపితే నిరుద్యోగుల జీవితాలను నాశనం చేయాలని బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం అమా నుషమన్నారు. నిన్న దేశానికి అన్నం పెట్టే రైతును చంపారు, దేశానికి రక్షణగా ఉండే ఆర్మీ జవాన్లను బలితీసుకున్నారని నేడు అగ్నిపథ్ పేరుతో యువను చంపడం అత్యంత హేయమైన చర్యని దుయ్య పట్టా రు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాఖ్యలు నిరుద్యో గులను కించపర్చే విధంగా ఉన్నారన్నారు. ఆర్పీఎఫ్ ఎస్పీ అనురాధ నిరసనలో పాల్గొంటే యావజ్జీవ శిక్ష వేస్తామని హెచ్చరించారని, దేశంలో నిరసన వ్యక్తం తెలిపే హక్కు లేదా అన్నారు. 100 మంది రైతుల ప్రాణాలు తీసి, ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌక కార్పోరేట్ సంస్థలకు అప్పగించి, అప్పులు ఎగ్గొట్టి దేశం విడిచి ముంచిన మోసగాళ్లకు కొమ్ముకాసిన మోడీకి ఏ శిక్ష విధిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ నిరుద్యోగులకు కేంద్రం ఉద్యోగాలు రాకుండా చేయడం కోసమే కుట్రపన్నుతుందన్నారు. ఈ కుట్రలను చేధిస్తామని నిరుద్యోగలు జోలికొస్తే గోరి కడతామని, బీజేపీ నేతలు ఒల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. వెంటనే అగ్నిపథ్ రద్దు పర్చి దేశ ప్రజలకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.