Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట
అర్హులైన నిరుపేదల అందరికీ ఇండ్ల స్థలాలు, ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పస్రా గ్రామంలోని 109/ఆ/ఈ గల ప్రభుత్వ భూమిలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడుతూ అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూం గృహాలు నిర్మించి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అర కొర గృహాలతో పేదలకు అందని ద్రాక్షగా పథకాన్ని నిర్వహిస్తోందన్నారు. సుమారు 25 సంవత్సరాల పై బడి ఏ ప్రభుత్వము నివాస స్థలం లేని పేదలను గుర్తించి స్థలాలు ఇప్పటివరకు ఇవ్వలేదని అన్నారు. దీంతో వందలాది మంది భార్యాపిల్లలతో అద్దె గదు ల్లో చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితాలను గడు పుతున్నారు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం ఆధ్వ ర్యంలో పేద ప్రజల నివాస స్థలాల కోసం అనేక పో రాటాలు చేసి లక్షలాది మందికి నివాస స్థలాలు అం దేవిధంగా పోరాటాలు చేసి సాధించామని వెం కట ్రెడ్డి అన్నారు. ఏజెన్సీ ఏరియాలో ప్రభుత్వ భూమి లో గిరిజనేతరులకు పట్టాలు ఎలా ఇస్తారని ప్రభు త్వాన్ని ప్రశ్నించారు. అక్రమ పట్టా పొందిన పుల్యాల వసంత భూమి పట్టారద్దు చేయాలని కబ్జా లో ఉన్నటువంటి కొమురెల్లి జనార్ధన్ రెడ్డిని భూమినుండి వెళ్లగొట్టాలని తహసిల్దార్‌ను కోరారు. పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని యె డల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దశలవారీగా పోరా టం నిర్వహిస్తామని హెచ్చరించారు. సిపిఎం నాయకులు బీరెడ్డి సాంబశివ, తీగల ఆదిరెడ్డి, పొదిల చిట్టిబాబు, గొంది రాజేష్, పాయం శారద, రాజేశ్వరి, సువర్ణ, రమేష్, రాజు, హసీనా, సర్వర్ పాల్గొన్నారు.