Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గర్భిణుల నమోదు వంద శాతం చేయాలి
- జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య
నవతెలంగాణ-ములుగు
జిల్లాలో డెంగ్యూ, విష జ్వరాలు ప్రబలకుండా నియంత్రణకు ప్రజలు తప్పనిసరిగా ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని కలెక్టర్ యస్ క్రిష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన సమావేశంలో సీజనల్ వ్యాధులు, గర్భిణుల నమోదు, రక్తహీనత డెంగ్యూ ప్రభుత్వ ప్రసవాలపై కలెక్టర్ సమీక్షిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ నమోదు నూటికి నూరు శాతం నమోదు చేయాలని, రక్తహీనత కొరకు సెల్ కౌంటర్‌ను ఉపయోగిం చుకోవాలని కోరారు. దీనికి సంబంధించిన యాప్ ను ప్లే స్టోర్ నుండి ప్రతి ఆశ డౌన్లోడ్ చేసుకొని ఈ వారంలో కనీసం ఐదు టెస్టులు చేసి నమోదు చేయా లని సూచించారు. వర్షాకాలం ప్రారంభం అవుతు న్నందున దోమలు అభివృద్ధి చెందకుండా నివారణ చర్యలు జీపీ సిబ్బంది సమన్వయంతో తీసుకోవాలని సూచించారు. ప్రైవేటు లేబరేటరీలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగ్యూ, మలేరియా కేసులు నమోదైన వాటిని ఎలీసా టెస్ట్ ద్వారా నిర్ధారిం చుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి అనుమతితో మాత్రమే నోటిఫై చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డ్రగ్స్ నిల్వలు అత్యవసర సమయంలో వాడే మందులు సమీక్షిస్తూ అవ స రం ఉన్న మందులను తీసు కోవా లని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి మంజూ రైన 34 ఉప కేంద్రాల యొక్క నిర్మాణాలు జరుగుతున్నందున పూర్తయిన ఉప కేంద్రాలను వెంటనే ఉపయోగంలోకి తేవాలని, వైద్యాధికారులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోగ నిర్ధారణ పరీక్షలకు సంబం ధించిన అన్ని రసాయనాలు సమకూర్చుకోవాలని వాటి నిల్వలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, అత్యవసరమైన వాటిని తెప్పించు కోవాలని కోరారు. అత్యవసర సమయంలో అవసరమైన రోగులకు ఎక్స్ రేలు పరీక్షలు నిర్వహించాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలో వారి టూర్ ప్రోగ్రాంలను పీహెచ్సీ వైద్యాధికారికి అందజేయాలన్నారు. అలాగే వారం దరూ అటెండెన్స్ యాప్‌లో హాజరు నమోదు చేయా లని పేర్కొన్నారు. జిల్లాలో పని చేయుచున్న మాతా శిశు సంరక్షణ బం ధాలు వారు నిర్వహించు క్యాం పులు వారి టూర్ ప్రోగ్రాంను క్షేత్రస్థాయిలో సిబ్బం దికి ఉన్న ఆరోగ్య సిబ్బందికి, సర్పంచ్‌కి తెలియ జేయాలని తెలిపారు. అత్యవసర సమయంలో రెఫారల్ చేయి కేసులను ప్రభుత్వ అంబులెన్స్‌లో మాత్రమే చేయాలని తెలి పారు. కార్యక్రమంలో ఐటిడిఎ పీవో అంకిత్, అద నపు కలెక్టర్లు ఇలా త్రిపాఠి, జిల్లా వైద్యాధికారి అప్ప య్య, , డిప్యూటీ డిఎంహెచ్వో విపిన్, డాక్టర్ డాక్టర్ క్రాంతి కుమార్, డాక్టర్ రవీందర్, డాక్టర్ మృదుల, డెమో తిరుపతయ్య, వైద్యాధికారులు ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.