Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
వర్షాకాలంలో భవన నిర్మాణ సమయంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు ఖచ్చితంగా పాటించాలని నగర మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం బిల్డర్లు, గుత్తేదారుల తో సమావేశం నిర్వహించారు. మురుగు కాల్వలు నిర్మించేటప్పుడు మ్యాన్‌హోల్స్ మూసివేయాలని, అదేవిధంగా అభివృద్ధి పనులు నిర్మాణ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా వాచ్మెన్లను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఫుట్ పాత్ల మధ్యలో గ్యాప్ ఉంటే పూరించాలని తెలిపారు. కార్మికులు బ్లౌజులు, జాకెట్, బూట్లు తప్పక ధరించాలన్నారు. పని చేస్తున్నప్పుడు ఉత్పన్నమయ్యే అన్ని ప్రమాదాలకు కాంట్రాక్టర్లు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. నిర్దేశించిన అన్ని నిర్మాణ ప్రాంతాలలో వారం గడువు లోపు నిబంధనలు అమలు కావాలని, క్షేత్ర స్థాయిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తామని, అమలు కానిచో జరిమానా లతోపాటు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిబంధనలను తూ చ తప్పకుండా పాటిస్తామని కాంట్రాక్టర్లు, బిల్డర్లు అండర్ టేకింగ్ పత్రాన్ని సమర్పిం చారు. ప్రతి అపార్ట్మెంట్లో మడ్ సంప్, డి వాటరింగ్ యంత్రం ఉండాలని, విద్యుత్ ప్యానల్ బోర్డ్ సెల్లార్ బదులుగా మొదటి అంతస్తులోకి మార్చుకోవాలని అన్నారు. నిర్మాణాలు చేసేటప్పుడు ప్రక్కకు పాత భవనాల గోడలు ఉంటే వాటిని తొలగించాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ అనిస్ ఉర్ రషీద్, ఎస్ఈలు సత్యనారాయణ, నవీన్ చంద్ర, సీపీ వెంకన్న, సిఎంహెచ్ఓ డాక్టర్ రాజి రెడ్డి, ఈఈ లు, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు, వింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు పాల్గొన్నారు.