Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని దుంపలపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని దుంపలపల్లి గ్రామానికి చెం దిన నీరటి మల్లయ్య (38) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.మిర్చి పంట కోసం అప్పులు చేసి పంటలు పండించగా సరైన దిగుబడి రాక అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపానికి గురై సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరిఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య సవిత, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. మృతుని భార్య సవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.