Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
వర్షాకాలంలో సీజనల్ వ్యాధు లపై ప్రజలు అప్రమత్తంగా ఉండా లని మాతాశిశు సంక్షేమ శాఖ వైద్యా ధికారి డాక్టర్ బానోత్ పవన్ కుమార్ అన్నారు. మంగళవారం మం డలంలోని లక్ష్మీపురం పంచాయతీ నేతకానిగూడెంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఆయన ప్రజలను పరీక్షించి మాట్లాడారు. వర్షాకాలంలో ఎక్కువగా విష జ్వరాలు ప్రభలే అవకాశం ఉన్నందున పరిసరాలు శుభ్రంగా ఉండాల న్నారు. ఇంటి ఆవరణలో పిచ్చిమొక్కలు లేకుండా శుభ్రపరచుకోవాలన్నారు. చలితో జ్వరం వచ్చినట్లయితే వెంటనే సమీపంలోని పీహెచ్సీలో చికిత్స తీసుకోవాలని అన్నారు. శిబిరంలో లక్ష్మీపురం సర్పంచ్ లావుడియా స్వాతి, తదితరులు పాల్గొన్నారు.