Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-ములుగు
రైతు ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం గోవిందరావుపేట, ములుగు మండలానికి చెందిన ఇటీవలే ఆత్మ హత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు తప్పెట్ల స్వరూప, మేడ సంధ్య, గువ్వ సరిత, అరిగెల రాజేంద్ర కుటుంబాలకు ఒక్క కుటుంబానికి రూ.50 వేలు కాంగ్రెస్ పక్షాన లబ్ది దారులకు సీతక్క, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి చెక్కులను అందించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మద్దతు ధర లేక పురు గుల మందులు తాగి ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలకు అండగా నిలవాల్సిన నాయకులు పట్టిం చుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా పేరుతో రైతులను మోసం చేస్తోంద న్నారు. వడ్ల కొనుగోలులో క్వింటాలుకు 4 నుండి 5 కిలోల తరుగు పేరుతో రైతులను మిల్లర్లు మోసం చేస్తుంటే చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. వేసవిలో వరి వేస్తే కొనుగోలు చేయమని ప్రభుత్వాలు చెప్పడం దారుణ మన్నా రు. లక్షల కోట్లు ప్రజా నిధులతో ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు పంటలు కొనమనడం సరికాదన్నారు. కాంగ్రెస్ హయాం లో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్టు గుర్తు చేశారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిం చాలని, ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలనీ సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెళ్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్‌రెడ్డి, మేడ్చల్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు సదానందం వెంక టాపూర్ మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీని వాస్, సత్తిరెడ్డి, రేవంత్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.