Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కుష్టువ్యాధి నియంత్రణ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్‌బాబు
నవతెలంగాణ-మట్టెవాడ
ప్రాథమిక దశలోనే కుష్టు వ్యాధి లక్షణాలను గమనించి, నిర్ధారించి, ఎండీటీ చికిత్స అందించాలని దీంతో వ్యాధిగ్రస్తులలో అంగవైకల్యతను నివారించవచ్చని రాష్ట్ర లెప్రసీ నియంత్రణ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్ బాబు పేర్కొన్నారు. మంగళవారం డీఎంహెచ్‌వో కాన్పరెన్స్ హాల్లో పిహెచ్సి, యూపిహెచ్సి లెప్రసీ నోడల్ పర్సన్‌తో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లా డారు. సామాజిక అంశాలు, మూఢనమ్మకాలు, ఇతర కార ణాల వలన లక్షణాలున్న వారు స్వయంగా ముందుకు రావ డం లేదని అందువల్ల, ఎల్సీడీఎస్ సర్వే సమయంలో అలాగే గృహ సందర్శన సమయంలో లక్షణాలను అడిగి తెలుసుకొని పరిశీలించాలన్నారు. శరీరంపై తెల్లని, ఎర్రని రంగు మచ్చలు స్పర్శ లేకుండా మొద్దుబారి ఉండటం, అరికాళ్ళలో, అరచేతుల్లో తిమ్మిర్లు రావటం, కనురెప్పలు సరిగా మూసుకోక మోసపోవడం, అరిపాదం సరిగా పైకి లేకపోవడం వంటి లక్షణాలు ఉన్న వారిని పరీక్షిం చాలన్నారు. ప్రజలు కూడా లక్షణాలు గమనించినపుడు ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలన్నారు. ఏఎన్ఎంలు, ఆశాలకు, లెప్రసీ నోడల్ పర్సన్స్ పిహెచ్సి స్థాయిలో ఈ విషయాల్లో శిక్షణ అందించాలన్నారు. ప్రతి వెయ్యి మందిలో ఒకరి కంటే తక్కువ కేసులు నమోదు అవు తున్నాయన్నారు. హనుమకొండ జిల్లాలో 33 కేసులున్నాయన్నారు. అంగవైకల్యత ఉన్న వారికి రికన్ స్ట్రక్టివ్ సర్జరీ చేయించడం జరుగుతుందని, అలాగే 2 జతల ఎంసీఆర్ చెప్పులు, పర్సనల్ సేఫ్టీ కిట్స్ అంధిం చటం జరుగుతుందన్నారు. రాష్ట్రం నుండి శాంపిల్ సర్వే బందం జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి వి. అశోక్ రెడ్డి, లేప్రసి హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాస్, ఫిజియోథెరపిస్ట్ నరసింహ రెడ్డి, ఎన్హెచ్ఎం డిపిఎంఓ శ్రీనివాస్, డిపిఎంఓలు సతీష్ రెడ్డి, గోపాల్ రెడ్డి, ఏప్షిఎంఓ బుచ్చి నర్సు, శాంపిల్ సర్వే బందం కె. శ్రీనివాస్ రెడ్డి, లోకెందర్, అరుణ, లుర్తమ్మ తదితరులు పాల్గొన్నారు.