Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
- 18 ఎకరాల భూమిని పరిశీలించిన కలెక్టర్
నవతెలంగాణ-గణపురం
మండలంలోని నగరంపల్లి శివారు కొండంపల్లి గ్రామస్తులు మంగళవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా వాహనాన్ని అడ్డుకున్నారు. ఓసి త్రీ లో భూములు కోల్పో యిన భూ నిర్వాసితులకు ఇప్పటివరకు నష్టపరిహారం రాలేదన్నారు. గ్రామాన్ని తరలిస్తామని ఏళ్లు గడుస్తున్నా నేటికీ తరలించకపోవడం విడ్డూరమన్నారు. సింగరేణి, రెవెన్యూ అధికారులు సర్వేల మీద సర్వే చేసి పోతున్నారే తప్ప తమకు న్యాయం జరగడం లేదన్నారు. గ్రామాన్ని తరలిస్తారనే ఉద్దేశంతో తాము నూతన గహాలు కట్టుకోలేక పోతున్నామని, తమ ఇండ్లను మరమ్మతు చేయలేకపో తున్నామన్నారు. తమ గ్రామాన్ని తరలించి పునరా వాసానికి ప్యాకేజీ అందించాలన్నారు. వర్షాకాలంలో ఇండ్లు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. పంట భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు కొందరికి నష్టపరిహారం ఇప్పటివరకు అందలేదన్నారు.
18 ఎకరాల భూమిని పరిశీలించిన కలెక్టర్
కొండంపల్లి శివారులో ఉన్న 18 ఎకరాల భూమిని కలెక్టర్ భవిష్ మిశ్రా పరిశీలించారు. ఓ సి త్రీ బావి కొండం పల్లి సమీపంలో ఉండగా ఆ మట్టిని గుట్టలు గుట్టలుగా పోస్తుండడంతో ఆ మట్టి 18 ఎకరాల పట్టా భూమిలో పడుతుందన్నారు. సింగరేణి అధికారులు గత నాలుగు సంవత్సరాలుగా ఆ భూమిని తీసుకోకపోవడంతో నాలు గేళ్లుగా ఆ భూమి పడావుగా ఉంటుంన్నారు. ఆ భూమికి కరెంటు కట్ చేశారు. ట్రాన్స్ఫార్మర్ తీసేశారు. ఆ భూమి కి వెళ్లాలంటే దారి కూడా లేకుండా పోయింది. దీంతో 18 ఎకరాల భూ నిర్వాసితులు సింగరేణి అధికారులకు మొరపెట్టుకోగా తామేమీ చేయలేమని కలెక్టర్ స్వయంగా చూస్తేనే పరిహారం ఇస్తామని సింగరేణి అధికారులు చెప్పడంతో భూ నిర్వాసితులు కలెక్టర్కు మొర పెటు ్టకున్నా రు. దీంతో కలెక్టర్ స్వయంగా వచ్చి 18 ఎకరాల భూమిని పరిశీలించారు. త్వరలో ఈ భూమిని సర్వే చేసి రైతులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.