Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం చెరువు శిఖం పరిధిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకొని నెల రోజులుగా ఉంటున్న గుడిసె వాసు లపై మంగళవారం భూ మాఫియా విచక్షణ రహితంగా మీద పడి చేతికి అందిన దొడ్డు కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో సుమారుగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసులు ఆంబులెన్స్‌లో వరంగల్ ఎంజీ ఎం కు తరలించగా వైద్యులు చికిత్స అందిం చారు. మంగళవారం 10 గంటల ప్రాంతంలో వరంగల్ ఎంజీఎం అత్య వసర విభాగం పేద గుడిసె వాసులతో కిక్కిరిసిపోయింది. ఎందుకు కొడుతున్నారో సమాధానం చెప్ప కుండా విచక్షణ రహితంగా దొరికిన వారిని దొరికినట్టుగా చితకబాదారని గర్భిణీ మహిళపై భూ మాఫియా కడుపుపై విచక్షణ రహితంగా కొట్టడంతో మహిళ నోటిలో నుండి రక్తం వచ్చిందన్నారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించడం కోసం ఆసుపత్రికి తరలించారని పేద గుడిసే వాసులు వాపో యారు. భూ మాఫి యా గుడిసె వాసులపై దౌర్జన్యం చేస్తూ కర్రలతో కొడు తున్నా పోలీసులు దగ్గర ఉండి ప్రేక్షక పాత్ర పోషించారని గుడిసె వాసులు ఆరోపించారు.