Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
మంథని నియోజకవర్గం శాంతియుతంగా ఉండేలా చూడాలని మాజీమంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు గ్రామదేవతలకు విన్నవించారు. మండలంలోని పెద్దతూండ్ల, గాదంపల్లి గ్రామాల్లో భూలక్ష్మీ, మహాలక్ష్మి, బొడ్రాయి, పోచమ్మ తల్లుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు గ్రామస్తుల ఆధ్వర్యం లో మంగళవారం అంగరంగవైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరు కాగా గ్రామస్తులు డప్పు చప్పుళ్ళ తో ఘన స్వాగతం పలికారు. వేదపండితులచే ప్రత్యే కంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ సంవత్సరం వర్షాలు సంవద్దిగా కురువాలని, రైతులకు పాడి,పంటలు పండాలని, తల్లుల దీవెనలు మంథని నియోజక వర్గంతోపాటు తెలంగాణ ప్రజలపై ఉండాలని వేడుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు, సింగిల్ విండో డైరెక్టర్ ఇప్ప మొండయ్య, సర్పంచ్లు విజ య నాగేశ్వర్ రావు, రమేష్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంథని రాజా సమ్మయ్య, యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాంతి, పొలం శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే గాదంపల్లిలో విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధూకర్-శైలజ దంపతులు హాజ రయ్యారు. డప్పుచప్పుళ్లతో దంపతులకు గ్రామ ప్రజలు స్వాగ తం పలికారు. వర్షాలు సమద్ధిగా కురిసి పంటలు పండెలా చూడాలని తల్లులను కోరారు. అనంతరం గ్రామ ప్రజలు జడ్పీ ఛైర్మన్ దంపతులను సన్మానించారు.