Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీ వరంగల్, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి
నవతెలంగాణ-మట్టెవాడ
ప్రభుత్వ ఆస్పత్రులలో పేదలకు కార్పోరేట్ వైద్యం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ నేతలు వరంగల్ ఎంజీఎంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయ్యాయని, సమ స్యలు పరిష్కరించలేని యెడల మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావు డప్పు కొట్టి హెచ్చరిస్తామని వరంగల్, హనుమకొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేం దర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎంజీఎం ఆస్పత్రిని కాం గ్రెస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఆస్పత్రిలోని రోగు లను ఆస్పత్రి సిబ్బందిని సమస్యలు అడిగి తెలు సుకు న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేయలేని అబివృద్ధి టీఆర్ఎస్ చేస్తోందని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు ఎంతో మెరుగ్గా ఉందని ప్రకటనలు తెచ్చుకుంటున్న టీఆర్ఎస్ నాయకులను కళ్ళు తెరిచి ఎంజీఎం ఆస్పత్రిలో నెలకొన్న ఇబ్బందులు చూడా లని డిమాండ్ చేశారు. ప్రజలు చికిత్సకోసం అత్యవసర విభాగం లోకి వస్తె పనిచేయని ఎక్స్‌రే, ఆసుపత్రిలో మం దుల కొరత, స్కానింగ్ వెళ్లే రోగులకు కావలసిన వీల్ చైర్ లు, వారిని తీసుకువెళ్లే పేషంట్ కేర్ సిబ్బంది కూడా లేరని మండిపడ్డారు. సెలైన్ బాటిల్లకు ఇచ్చే ఐవి సెట్లు లేకపో వడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఇకనైనా కళ్లు తెరిచి పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేలా ఆసుపత్రిలో చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, కార్పొరేటర్ తోట వెంకన్న, టిపిసిసి కార్యదర్శి మహమ్మద్ ఆయుబ్, కొత్తపల్లి శ్రీనివాస్, మీసాల ప్రకాష్, మాజీ కార్పోరేటర్ నసీం జాగాన్, జిల్లా ఎస్.సి. డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పెరు మాండ్ల రామకృష్ణ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, డాక్టర్ పులి అనిల్ కుమార్, యువజన కాం గ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి, పల్లకొండ సతీష్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్, పాల్గొన్నారు.