Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
రైతుల రుణమాఫీ, రైతుబంధు నిధులను వెంటనే అమలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రైతు సంఘం పల్లారుగూడ గ్రామ కమిటీ సమావేశం బానోత్ భీముడు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వర్షాకాలం మొదలై దాదాపు మూడు వారాలు గడిచినా రైతులకు అందాల్సిన పెట్టుబడి సహాయం, రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాలో పడలేన్నారు. రుణమాఫీ చేస్తానని 4 సంవత్సరాల క్రితం వాగ్దానం చేసిన ప్రభుత్వం ఇంతవరకు 70 శాతం రైతులకు రుణమాఫీ చేయకపో వడంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సానుభూతితో ఆదుకోవాలని సీఎంను, వ్యవసాయశాఖ మంత్రిని కోరారు. సమావేశంలో ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఓదెల రాజన్న, గూగులోతు తేజ, బొమ్మల నరసయ్య, గూగులోతు వీరేందర్, బానోత్ బద్రు, రవీందర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.