Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ కలెక్టర్ గోపీ, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్
నవతెలంగాణ-ఖిలావరంగల్
యోగాతో ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వరంగల్ కలెక్టర్ బీ గోపీ, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. మంగళవారం ఖిలావరంగల్ కోటలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమం నెహ్రూ యువకేంద్రం, కేంద్రీయ విద్యాలయం, ఆయుష్ శాఖ, ఫీల్డ్ అవుట్ రీచ్ బ్యూరో, జిల్లా అధికార యంత్రాంగం, కేంద్ర పురావస్తు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కూరపాటి ఆస్పత్రి సౌజన్యంతో నిర్వహించారు. కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లా డుతూ యోగాతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా చేసు కోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్లతో పాటు, పలు శాఖల అధికారులు, నాయకులు యోగా దినోత్సవం సందర్భంగా ఆసనాలు వేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు హరిసింగ్, శ్రీ వాస్తవ్, స్థానిక నాయకులు, అధికా రులు పాల్గొన్నారు. మధ్యకోటలోని ఖుష్మహాల్ వద్ద ఆజాధికా అమత్ మహోత్సవం సందర్భంగా మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణిలు జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. అనం తరం వారు మాట్లాడుతూ యోగా విశిష్టతను వివరిం చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు యోగ చేయాలి : ఎమ్మెల్యే రమేశ్
వర్ధన్నపేట : శారీరక మానసిక ఒత్తిడిని నివారించవచ్చునని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. మంగళవారం ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా యోగ ఆసనాలు ప్రాణాయామం వల్ల కలిగే ఉపయోగాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా మానసిక శారీరక ఒత్తిడి నివారించడంతో పాటు అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు యోగ ఎంతగానో ఉపయోగపడుతుంది
సంపూర్ణ ఆరోగ్యానికి యోగ సాధన చేయాలి
ములుగు : సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించేం దుకు ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. మంగళ వారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరిం చుకుని వెంకటాపూర్ మండలంలోని పాలంపేట రామప్ప లో టూరిజం, పురావస్తు, రెవెన్యూ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ అం తర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగాతో ఆయుష్షు పెరగడమేకాకుండా ఉల్లాసంగా ఉంటుందన్నారు. యోగా ద్వారా ఆరోగ్యంతోపాటు, మాన సిక ప్రశాంతత సిద్ధిస్తుందన్నారు. కార్యక్రమంలో ఇంటాక్ కన్వీనర్ నిట్ ప్రొఫెసర్ పాండురంగారావు, అద నపు కలెక్టర్ రెవిన్యూ వైవి.గణేష్, ఆర్డీవో రమాదేవి, టూరి జం జిల్లా అధికారి శివాజీ, పురావస్తు శాఖ అధికారి మల్లేశం, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, యోగా గురు వులు ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు. దీర్ఘకాలిక వ్యాధు లకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఆల్లెం అప్పయ్య తెలిపారు.8 వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా మంగళ వారం జిల్లా కేంద్రంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ములుగు జిల్లా వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల కమ్యూనిటీ హాల్ ములుగులో ఉదయం 6 గంటలకు యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు కొత్తపెల్లి పోషన్న యోగా ఆసనాలు, ప్రాణాయామం లను చేస్తూ, వాటి ప్రాముఖ్యతలను వివరించినారు. కార్యక్రమం లో జిల్లా ప్రజ లు, పురప్రముఖులు, యోగ గురువులు ,యూత్ సంఘాలు, లయన్స్ క్లబ్, వాకర్స్ అస్సోసియేషన్, ఆయుష్ వైద్య సిబ్బంది, పాల్గొన్నారు.
యోగాతో పరిపూర్ణమైన ఆరోగ్యం
భూపాలపల్లి : ప్రతి వ్యక్తి యోగాతో పరిపూర్ణమైన ఆరోగ్యంగా జీవించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్ర తెలిపారు. మంగళవారం ఉదయం సింగరేణి క్లబ్ హౌస్‌లో నిర్వహించిన 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కలెక్టర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ జెడ్పి చైర్పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి యోగా చేసి పరిపూర్ణమైన ఆరోగ్యంగా జీవించాలన్నారు. నిత్యం ఉదయం వ్యాయామం చేస్తూ, యోగా చేస్తూ సుఖంగా జీవించవచ్చని, ఉద్యోగులు నిత్యం టెన్షన్‌కు గురవుతున్నవారు ఉదయం ఇరవై నిమిషాలు యోగాకు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా వలన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతిరోజు ఉదయం వ్యాయామం, యోగా చేయడం అందరూ అలవర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సేగ్గంవెంకట రాణి సిద్ధూ, వైస్ చైర్మన్ హరిబాబు, ఆయా శాఖల జిల్లా అధికారులు యువతీ యువకులు పాల్గొన్నారు.