Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకుమట్ల
రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ హత్యలేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ చైర్మన్ సంకేట అన్వేష్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రామకష్ణాపూర్ టీ గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి అన్వేష్‌రెడ్డి, కాంగ్రెస్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని సుబ్బక్క పల్లి, గుమ్మడవెల్లి గ్రామాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వరంగల్ రైతు డిక్లరేషన్‌లో చెప్పిన విధంగా బాధిత కుటుంబాలకు రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి కు టుంబానికి అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి వారిని పట్టించుకోక పోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వైనాల రవీందర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ రేగొండ అధ్యక్షుడు ఇప్ప కాయల నరసయ్య, సీనియర్ నాయకుడు కిష్టయ్య, మండల నాయకులు పెరుమండ్ల లింగయ్య, దాసరి కుమారస్వామి, సాదా ఓదెలు, దయాకర్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.