Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని గురిమేళ్ళ గ్రామ పంచాయతీలో వ్యవసాయ శాఖ మండల అధికారి రాంజీ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం వానాకాలం సాగు పై రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మాలతి, శాస్త్రవేత్త కిషోర్ పాల్గొని మాట్లాడారు. పచ్చిరొట్ట ఎరువు ఉపయోగాలు, నేరుగా విత్తుకొనే వరి సాగు వివరాలు, భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా వాడకం, ఎరువులను దఫాలుగా వినియోగించడంపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం ఎఓ రాంజీనాయక్ మాట్లాడుతూ...నేరుగా విత్తుకునే వరి సాగులో కలుపు యాజమాన్యం పద్ధతులు, మిర్చి పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వజ్జా అనసూర్య, ఎంపీటీసీ వజ్జా భద్రయ్య, ఏఈవో తేజస్వి, రైతులు తదితరులు పాల్గొన్నారు.