Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జనగామ డిపో సీఆర్సీ టీబీ ఎస్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తొర్రూరు,పాలకుర్తి గ్రామాల్లో ఆర్టిసి సేవలపై ఆర్టీసీ కళాబందంతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టీబీ ఎస్ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అనేక రాయితీలు కల్పిస్తుందని తెలిపారు. 12 సంవత్సరాల లోపు విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పిస్తుందని, ఒకటి నుండి పదవ తరగతి వరకు చదివే ఆడపిల్లలకు ఉచిత బస్ పాస్తోపాటు ఇతర సేవలు అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసి పాలకుర్తి మండల ఇన్చార్జి బానోతు రవి నాయక్, కళాకారులు శంకర్, రాజు, స్వామి, శ్రీనివాసు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.