Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చినుకు పడితే కునుకు ఉండదు
నవతెలంగాణ - చిన్నగూడూరు
మట్టి గోడలు... పైన చిల్లులు పడ్డ రేకులు, మంచం పట్టేంత చిన్న గది. రాత్రి అయితే చిన్న బుడ్డి దీపంతోనే జీవనం. ఇక చినుకు పడితే కునుకు ఉండదు. ఇంత దుర్భర పరిస్థితితో మండలంలోని పగిడిపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు దుస్స ఎల్లమ్మ జీవనం సాగిస్తోంది. ఆమెకు భర్త, పిల్లలు ఎవ్వరూ లేరు. కేవలం రూ.2వేల పింఛనుతోనే నెల మొత్తం గడుపుకోవాల్సిన పరిస్థితి. పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామానికి స్పెషల్ ఆఫీసర్గా వచ్చిన రమ్య ఆమె పరిస్థితిని చూసి రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు. చుట్టుపక్క వాళ్లు అన్నం, నీళ్లు ఇతర ఆర్థిక పరిస్థితుల్లో ఆదుకుంటున్నారు. అసలే వర్షాకాలం ఈదురు గాలులతో కూడిన వాతావరణంలో ప్రస్తుతం ఆ వృద్ధురాలు క్షణక్షణం భయంతో జీవనం సాగిస్తోందని మరి కొందరు దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని, ప్రభుత్వం ఆమెకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.