Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
శాయంపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ముందు మిషన్ భగీరథ నీరు వధాగా పోతున్నా గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, జీపీ సిబ్బంది పట్టించుకున్న పాపాన పోవడం లేదు. శాయంపేట గ్రామంలో రోడ్డు విస్తరణ పనుల్లో ప్రభుత్వ బాలుర పాఠశాలకు వెళ్లే మిషన్ భగీరథ పైప్ లైన్ తెగిపోయింది. పైపులైను మరమ్మతు చేయకుండానే రోడ్డు నిర్మాణం చేపట్టారు. సెంట్రల్ లైటింగ్ వేయడానికి వదిలిన ఖాళీ ప్రదేశంలో పైపులైను వదిలివేశారు. మిషన్ భగీరథ నీరు విడుదల చేసినప్పుడు పైపు నుండి నీరు వధాగా పోతోంది. పాఠశాల ఈనెల 13 నుండి ప్రారంభం కావడం, ఆ ప్రాంగణంలోనే అంగన్వాడీ కేంద్రం కొనసాగుతుండడంతో వారికి నీటి సమస్య తలెత్తుతోంది. ఇప్పటికైనా పాలకులు స్పందించి పైపులైను పాఠశాల ప్రాంగణంలోకి ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం అందించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.