Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ-పాలకుర్తి
అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే బాధ్యతను ప్రజాప్రతినిధులు తీసుకో వాలని, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అరాంరకె, మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళితబంధు రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మండల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో సంక్షేమ పథకాల పంపిణీ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని, పథకాల ఎంపికలో అర్హులు తప్పిపోకుండా చూడాలని ఆదేశించారు. అనర్హులకు సంక్షేమ పథకాలు అందించవద్దని ఆదేశించారు. దళితబంధు తోపాటు సంక్షేమ పథకాల పంపిణీపై దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్ని గ్రామాల్లో మొదటి విడత దళిత బంధు ఇచ్చామని, రెండో విడతగా త్వరలోనే ఇవ్వనున్న దష్ట్యా అర్హులైన వారిని ఎంపిక చేయాలని సూచించారు. చదువు కున్న వారికి, నిరుద్యోగులకు మొదటి ప్రాధాన్యమి వ్వాలని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అర్హులను ఎంపిక చేయాలన్నారు. ఎంపీపీ నల్ల నాగి రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్, జడ్పీ ఫ్లోర్ లీడర్ పూస్కూరి శ్రీనివాసరావు, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి మదర్, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ వీరమనేని యాకాంతారావు, పాలకుర్తి సొసైటీ చైర్మన్ బొబ్బల అశోక్ రెడ్డి, జీసీసీ మాజీ చైర్మన్ ధరావత్ మోహన్ గాంధీ నాయక్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య పాల్గొన్నారు.
పట్టుదలతో చదవాలి
లక్ష్యాన్ని సాధించేందుకు పట్టుదలతో చదివినప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మండల కేంద్రంలో గల భషారత్ గార్డెన్లో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు నిర్వహిస్తున్న గ్రూప్స్ ఉచిత శిక్షణ సందర్భంగా ఉచిత శిక్షణ పొందుతున్న విద్యార్థులకు మంగళవాకం పోటీ పరీక్షల మెటీరియల్ ను అందజేశారు. ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకొని జయశంకర్ సార్ చిత్రపటానికి పూల మాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ శిక్షణ సందర్భంగా శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతీ, యువకులు విశ్రమించి వద్దని లక్ష్యాన్ని సాధించినప్పుడే ఎర్రబెల్లి ట్రస్ట్ అందిస్తున్న ఉచిత శిక్షణకు సార్థకత ఉంటుందని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, పాలకుర్తి కేంద్రాలుగా టెట్, గ్రూప్స్, పోలీసు ఉద్యోగాలకు ఇచ్చిన శిక్షణ వల్ల అనేక మంది ఉద్యోగాలు పొందారన్నారు. అదే దశలో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నోటిఫికేషన్లు వేస్తున్న దాదాపు లక్ష ఉద్యోగాల్లో ఎక్కువ భాగం మన విద్యార్థులే, మన దగ్గర శిక్షణ పొందిన వారే సాధించాలని ఆకాంక్షించారు. ఎంపీపీ నల్ల నాగి రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండీ మదర్, జడ్పీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, ప్రొఫెసర్ జయశంకర్ అకాడమీ డైరెక్టర్ సత్యనారాయణ చారి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు వీరమనేని కాంతారావు ఎంపీటీసీ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.