Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి
నవతెలంగాణ-ఎన్జీఓస్ కాలనీ
ఈనెల 24 నుంచి సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి తెలిపారు. హనుమకొండ రాంనగర్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యుడు సారంపల్లి వాసుదేవరెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశంలో చక్రపాణి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ను తీసుకురావడం, తది తర అంశాలపై చర్చించనున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ, సబ్సిడీ ఎరువులు అందించడం లేదన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదని చెప్పారు. పాలకుల తప్పుడు విధానాల వల్ల అన్ని తరగతుల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. రాష్ట్ర కమిటీ సమావేశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేయనున్నట్టు తెలిపారు. సమావేశాలకు పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు హాజరు కానున్నట్టు చెప్పా రు. సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వాంకుడోత్ వీరన్న, రాగుల రమేష్, మంద సంపత్, దొగ్గెల తిరుపతి, గుమ్మడిరాజుల రాములు, ధరావత్ భానునాయక్ తదితరులు పాల్గొన్నారు.