Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
ఆర్యవైశ్యులలో చైతన్యాన్ని రగిలిం చడమే కాకుండా ఆర్యవైశ్యుల్లో విధి వంచితులను ఆదుకోవడంలో ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ముందు వరుస లో ఉంటు ఆదర్శంగా ఉంటుం దన్నారు. జనగాం జిల్లా రఘునాథపల్లి నివాసి ఆర్య వైశ్య సమాజానికి చెందిన గోవిందు నరేందర్ చిన్న కార్యాల యంలో గుమస్తాగా 30 సంవత్సరాలుగా ఉం టున్న ఆయనకు ఇటీవల యాక్సిడెంట్ కావడంతో రెండు కాళ్ళు విరిగి నడవలేని పరిస్థితుల్లో దుర్భర జీవితం గడుపు తున్నాడు. ఆయనను ఆదుకునేవారు లేరు అది తెలుసుకున్న ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుండా ప్రభాకర్ గుప్తా, కన్వీనర్ దేవా అరవింద్ బాబు, ఆధ్వర్యంలో ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితిలోని తమ సభ్యుల నుండి కొంత మొత్తంలో నగదును సమీకరించి రూ.40 వేల చెక్కును బుధవారం ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి వరంగల్ జిల్లా కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడుకులు లేక తనకు ఉన్న ఇద్దరు బిడ్డల ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్న గోవింద్ నరేందర్‌కు సాయం అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సాయంతో పాటు మరి కొంత ఆర్థిక సహాయం ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి చేస్తోందని అన్నారు.